Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఆటిజం' చిన్నబోయింది... గోల్డ్ మెడల్ అతని సొంతమైంది!

లాస్ ఏంజెల్స్ లో జరుగుతున్న 'స్పెషల్ ఒలింపిక్స్ వర్డల్ గేమ్స్'లో భారత్ కు చెందిన గోల్ఫర్ రణ్ వీర్ సింగ్ సైనీ స్వర్ణ పతకాన్ని సాధించాడు. దాంతో ఈ క్రీడల్లో తొలిసారి పసిడి పతకం దక్కించుకున్న క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. జీఎఫ్ లెవ్ 2, ఆల్టర్ నేట్ షాట్ టీమ్ ప్లే ఈవెంట్ లో తన భాగస్వామి మోనికా జాజూతో కలసి 14ఏళ్ల రణ్ వీర్ ఈ ఫీట్ సాధించాడు. గుర్గావ్ కు చెందిన ఈ క్రీడాకారుడు రెండేళ్ల వయసు నుంచే ఆటిజంతో బాధపడుతున్నాడు. అయితే తన తొమ్మిదేళ్ల వయసు నుంచీ గోల్ఫ్ ఆడుతున్నాడు. గతంలో జరిగిన ఆసియా పసిఫిక్ వరల్డ్ గేమ్స్ లో రెండు గోల్డ్ మెడల్స్ సాధించిన మొదటి భారతీయుడిగా కూడా రికార్డు సాధించాడు.

More Telugu News